Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మూడేళ్ల చిన్నారి చేతిలో పేలిన తుపాకి.. ఏడాది వయసున్న చెల్లి మృతి.. అమెరికాలో ఘోరం!

3 Year Old Child Shoots Dead One Year Old Sister In USA
Advertisement
  • కాలిఫోర్నియాలో సోమవారం చోటుచేసుకున్న ఘటన
  • తలకు బుల్లెట్ గాయంతో పడిపోయిన పాప
  • ఆసుపత్రికి తరలించిన ఎమర్జెన్సీ సిబ్బంది
Advertisement
అమెరికాలోని కాలిఫోర్నియాలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం ఓ చిన్నారి పొరపాటున తన సోదరిని చంపుకుంది. ఇంట్లో గన్ తో ఆటలాడుతూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కింది. దీంతో అక్కడే ఆడుకుంటున్న చెల్లి తలలో నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. రక్తపుమడుగులో పడిపోయిన సోదరిని చూసి ఎమర్జెన్సీకి ఫోన్ చేసింది. దీంతో ఫైర్ డిపార్ట్ మెంట్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బుల్లెట్ గాయంతో రక్తపుమడుగులో పడి ఉన్న ఏడాది చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, పాప అప్పటికే చనిపోయిందని వైద్యులు ప్రకటించారు.

కాలిఫోర్నియాలోని శాన్ డియాగో కౌంటీ ఫాల్ బ్రూక్ లో సోమవారం ఉదయం 7:30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఘోరం జరిగింది. మూడేళ్ల చిన్నారి తన ఏడాది వయసున్న చెల్లితో కలిసి ఆడుకుంటూ తుపాకీ ట్రిగ్గర్ నొక్కింది. దీంతో ఎదురుగా కూర్చున్న పాప తలలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. పాప ప్రాణాలు కాపడేందుకు శాయశక్తులా ప్రయత్నించామని, అయితే, ఆసుపత్రికి తరలించేలోగా చనిపోయిందని వివరించారు. అయితే, ఇంట్లో పెద్దవాళ్లు ఏమయ్యారు.. చిన్నారి చేతికి గన్ ఎలా వచ్చిందనే దానిపై దర్యాఫ్తు జరుపుతున్నామని శాన్ డియాగో కౌంటీ పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement
USA
Kids
gun firing
sister death
California

More Telugu News