Prabhas: ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ నుంచి అప్‌డేట్.. ఫస్ట్ గ్లింప్స్​ ఎప్పుడంటే..!

Highly anticipated project K first glimpse on July 20th and July 21st in India
షార్ట్స్‌లో చూడండి
ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ప్రాజెక్ట్ కె’. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కూడా నటిస్తుండడంతో ఈ సినిమా కోసం భారత సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఈ సినిమా నుంచి తాజా అప్డేట్ ఒకటి వచ్చింది.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె టైటిల్, గ్లింప్స్ విడుదల తేదీ ఖరారైంది. అమెరికాలో ఈ నెల 20న, ఇండియాలో 21న టైటిల్, గ్లింప్స్ విడుదల కానున్నాయి. 20న శాన్ డియాగో కామిక్ కాన్‌లో జరిగే ఈ వేడుకకు ప్రభాస్, కమలహాసన్, దీపికా పదుకొణే, నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాతలు హాజరుకానున్నారు. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో నిర్మితం అవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Go Back to Shorts
Prabhas
Project K
first glimpse
July 20th
USA

More Telugu News