Devara: వెన్నెల వెలుగుల్లో సముద్రంలో ‘దేవర’ రక్తపాతం!

NTR Devara fifth schedule of action complete
షార్ట్స్‌లో చూడండి
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అఖండ విజయంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. అంత భారీ విజయం అందుకున్న తర్వాత ఆయన ‘దేవర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన కెరీర్‌‌లో మైలురాయిగా నిలిచిపోయే ‘జనతా గ్యారేజ్’కు దర్శకత్వం వహించిన కొరటాల శివతో తారక్ చేస్తున్న రెండో చిత్రం ఇది. హిట్ కాంబినేషన్ కావడంతో ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో తారక్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తోంది. సముద్రం బ్యాక్‌ డ్రాప్‌లో నడిచే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 

గత రెండు వారాలుగా యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించారు. సముద్రం సెట్‌లో ఈ సీక్వెల్స్ తెరకెక్కించారు. రాత్రిపూట వెన్నెల వెలుగుల్లో ‘దేవర’సృష్టించే రక్తపాతాన్ని తన కెమెరాలో బంధించినట్టు సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ట్వీట్ చేశారు. ఈ సీక్వెల్‌తో చిత్రానికి సంబంధించిన ఐదు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. రేపటి నుంచి ఆరో షెడ్యూల్ మొదలవుతుందని తెలుస్తోంది. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో మరిన్ని యాక్షన్ సీన్స్ తీస్తారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Go Back to Shorts
Devara
Jr NTR
Koratala Siva
Janvi kapoor
sea
fight

More Telugu News