వింత చోరీ.. ఏటీఎంలో డబ్బులకు బదులు ఏసీని ఎత్తుకెళ్లిన దొంగలు
- పంజాబ్లోని మోగా జిల్లా బాఘ్ పట్టణంలో వెలుగు చూసిన ఘటన
- బైక్పై వచ్చి ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులు
- ఏటీఎంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఘటన
- బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఆదివారం సాయంత్రం బైక్పై వచ్చిన ఇద్దరు దొంగలు ఏటీఎంలోకి ప్రవేశించారు. ఒకరు డస్టబిన్ను తిరగేసి దానిపై ఎక్కి ఏసీ వైర్లను కత్తిరించారు. ఆ తరువాత ఇద్దరూ కలిసి ఏసీని కిందకు దించి తమతో పాటూ తీసుకెళ్లిపోయారు. బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏసీ దొంగల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.