రెండేళ్ల జైలుశిక్షపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ
- మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు
- సెషన్స్ కోర్టు తీర్పును సమర్థించిన గుజరాత్ హైకోర్టు
- దీంతో సుప్రీం గడప తొక్కిన కాంగ్రెస్ అగ్రనేత
ఈ కేసులో రాహుల్ గాంధీకి శిక్ష సరైనదేనని, న్యాయపరమైనదేనని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ శిక్షను నిలిపివేయడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని, ఈ క్రమంలో పిటిషనర్ అభ్యర్థనను కొట్టి వేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. గుజరాత్ హైకోర్టులో చుక్కెదురు కావడంతో రాహుల్ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.