ఐసీసీ నుండి భారత్‌కు 72 శాతం పెరిగిన నిధులు!: బీసీసీఐ సెక్రటరీ జైషా
- ఇప్పటి వరకు ఐసీసీ ఆదాయంలో బీసీసీఐకి 22.4 శాతం వాటా
- ఇప్పుడు 38.5 శాతానికి పెరగడంతో 230 మిలియన్ డాలర్లు
- నాలుగేళ్ల పాటు అమలులో కొత్త రెవెన్యూ విధానం
ఇప్పటి వరకు ఐసీసీ ఆదాయంలో బీసీసీఐ 22.4 శాతం వాటాను దక్కించుకోగా, ఇక నుండి 38.5 శాతం రానుంది. దీంతో బీసీసీఐ ఆదాయం 72 శాతం పెరిగినట్లే. ఇది సమష్టి కృషితో సాధ్యమైందని జైషా అన్నారు. ఈ నిధులను క్రీడల అభివృద్ధి కోసం వినియోగిస్తామని తెలిపారు.
38.5 శాతానికి పెరగడంతో 2024-27 మధ్య వార్షిక ఆదాయం 230 మిలియన్ డాలర్లకు చేరుకోనుంది. భారత కరెన్సీలో ఇది దాదాపు రెండువేల కోట్ల రూపాయలు. ఈ కొత్త రెవెన్యూ విధానం నాలుగేళ్ల పాటు అమలులో ఉంటుంది.