ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించామన్న ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి

Jawahar Reddy on AP Employees demand
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 341 డిమాండ్లను పరిష్కరించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో గురువారం స్పష్టం చేశారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ సహా వివిధ శాఖల అధికారులు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ... పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని, కరోనా సమయంలో చనిపోయిన ఉద్యోగుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు 1,042 ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘం నేతలు పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
Go Back to Shorts
jawahar reddy
Andhra Pradesh
employees

More Telugu News