బీఆర్ఎస్ పార్టీలోనే దొంగలు: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీలోనే దొంగలు ఉన్నారని ఆ పార్టీ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనను పక్కన పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు పదవిపై ఎలాంటి వ్యామోహం లేదన్నారు. అభిమానం ప్రజల గుండెల్లో ఉండాలని, ఫ్లెక్సీలలో కాదని చురకలు అంటించారు. భూములు కబ్జా చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలేది లేదన్నారు. నియోజకవర్గ ప్రజలు మళ్లీ తననే ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.


More Telugu News