బండ్ల గణేశ్ కు ఏమైంది.. చేతికి సెలైన్ ఎందుకు?

Photo of Bandla Ganesh with saline going viral
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బండ్ల గణేశ్ ఫొటో
  • ఆసుపత్రి బెడ్ పై సెలైన్ తో ఉన్న బండ్ల
  • హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ప్రచారం
సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ఏం చేసినా, ఏం మాట్లాడినా సంచలనమే. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉండే బండ్ల గణేశ్... తనకు నచ్చని విషయాలపై, నచ్చని వ్యక్తులపై చేసే ట్వీట్లు సంచలనాన్ని రేకెత్తిస్తుంటాయి. జనసేనాని పవన్ కల్యాణ్ కు వీర భక్తుడిగా చెప్పుకునే బండ్ల... ఆయనపై ఎవరైనా ఒక్క విమర్శ చేసినా ఊరుకోరు. తనదైన స్టైల్లో విరుచుకుపడతారు. 

తాజాగా బండ్ల గణేశ్ హాస్పిటల్లో బెడ్ పై ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన చేతికి సెలైన్ కూడా ఉండటంతో ఆయనకు ఏమయిందనే చర్చ జరుగుతోంది. ఆయన వైరల్ ఫీవర్ బారిన పడ్డారని, హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెపుతున్నారు. ఈ వార్త నిజమా? కాదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 

Advertisement
Bandla Ganesh
Tollywood
Health

More Telugu News