Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నితిన్ సినిమా నుంచి తప్పుకున్న రష్మిక!

Rashmika Special
Advertisement
  • పాన్ ఇండియా స్థాయిలో రష్మిక ఫాలోయింగ్ 
  • 'పుష్ప' హిట్ తరువాత పెరిగిన మార్కెట్
  • వరుసగా భారీ ప్రాజెక్టులకి సైన్ 
  • డేట్స్ సర్దుబాటు చేయలేక నితిన్ ప్రాజెక్టు వదులుకున్న భామ
Advertisement
తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో రష్మిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాగే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లోను కుదురుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తోంది. ఈ బ్యూటీకి ఇన్ని భాషల్లోని అభిమానులలో మంచి క్రేజ్ ఉండటంతో, పాన్ ఇండియా సినిమాలు చేయాలనుకునేవారు ముందుగా ఆమెనే సంప్రదిస్తున్నారు. అలా ప్రస్తుతానికి తాను వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. 

ఒక వైపున తెలుగులో 'పుష్ప 2' వంటి భారీ ప్రాజెక్టు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నార్త్ ఇండియన్ .. సౌత్ ఇండియన్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగు - తమిళ భాషల్లో రూపొందుతున్న 'రెయిన్ బో' సినిమాలోనూ ఆమెనే కథానాయిక. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నదే. ఇవి కాకుండా రెండు హిందీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అందువలన ఇక నితిన్ - వెంకీ కుడుముల సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమని భావించిన ఆమె, ఆ సినిమా నుంచి తప్పుకుందని సమాచారం. గతంలో నితిన్ - రష్మిక కాంబినేషన్లో వచ్చిన 'భీష్మ' బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాంటి మేజిక్ మరోసారి రిపీట్ అవుతుందేమోనని అనుకుంటే, రష్మిక ఇలా హ్యాండ్ ఇచ్చేసింది. 

Advertisement
Advertisement
Rashmika
Nithin
Venky Kudumula

More Telugu News