ఢిల్లీలో మరో దారుణం.. ఫ్లైఓవర్ వద్ద ముక్కలుగా మహిళ శరీర భాగాలు

  • ఈస్ట్ ఢిల్లీలోని గీత కాలనీలో ఫ్లై ఓవర్ వద్ద గుర్తించిన స్థానికులు
  • సమాచారం అందుకొని ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
  • గతేడాది శ్రద్దా వాకర్ హత్యను తలపిస్తున్న ఘటన
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం చోటు చేసుకుంది. ఏడాది క్రితం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన శ్రద్దా వాకర్ హత్య ఘటన తరహాలో మరో యువతి హత్య జరిగింది. ఈస్ట్ ఢిల్లీలోని గీత కాలనీలో ఫ్లై ఓవర్ వద్ద ముక్కలుగా మహిళ మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఈ ఉదయం 9.15 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్లై ఓవర్ సమీపంలో పలు దిక్కులలో మహిళ శరీర భాగాలు గుర్తించారు. 

హత్యకు గురైన ఆ మహిళ ఎవరు? హత్యకు గల కారణం ఏమిటి? అనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతేడాది మే 26న శ్రద్ధ వాకర్‌ అనే యువతిని ఆమె ప్రియుడు అఫ్తాబ్ (28) అత్యంత దారుణంగా హత్య చేశాడు. తన ఫ్లాట్ లో శ్రద్ధ వాకర్ ను హతమార్చి ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి 18 రోజుల పాటు వాటిని ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేయడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది.

New Delhi
woman body
flyover
body parts

More Telugu News