కాంగ్రెస్ గంగా నది లాంటిది... ఎంతో మంది వచ్చి పునీతులవుతున్నారు: రేణుకాచౌదరి

renuka choudary fires on bjp annd congress
  • కేసీఆర్‌, కేటీఆర్ మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదన్న రేణుకా చౌదరి
  • మంత్రి హరీశ్‌ రావు టీవీ సీరియల్స్ రాసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని సెటైర్
  • సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటేనని విమర్శ
సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటేనని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ గంగా నది లాంటిదని, ఇందులోకి ఎంతో మంది వచ్చి స్నానం చేసి పునీతులవుతున్నారని చెప్పారు. 

ఆదివారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో రేణుకా చౌదరి మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. సర్వే నివేదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.

రాష్ట్రంలో వ్యవస్థలను 
కేసీఆర్ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్‌ల మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. మంత్రి హరీశ్‌ రావు టీవీ సీరియల్స్ రాసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఎద్దేవా చేశారు.

కేంద్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతోందని చెప్పారు. బీజేపీ ఉత్తరాదిన వంద సీట్లకుపైగా కోల్పోబోతోందన్నారు. బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని, మతతత్వ రాజకీయాలకు ఈ దేశంలో చోటు లేదన్నారు. 
పార్లమెంట్‌లో అసభ్యంగా, అసహ్యంగా ప్రధాని మోదీ అబద్ధాలు చెబుతున్నారని రేణుకా చౌదరి అన్నారు. 
Go Back to Shorts
Renuka Choudary
Congress
KCR
Narendra Modi
KTR
Harish Rao
ganga river

More Telugu News