Devineni Uma: అరాచక పాలనను ప్రజలు అంతమొందిస్తారు: దేవినేని ఉమ
వైసీపీ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అరాచక పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమవుతున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమ మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు.
టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందిస్తూ, వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల ఆస్తులు ఎలా కూల్చాలనే ఆలోచిస్తోంది తప్ప... ప్రజలకు ఏమి చెయ్యాలో ఆలోచించడం లేదని మండిపడ్డారు. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోతో వైసీపీ పతనం ప్రారంభమైందని అన్నారు.