సికింద్రాబాద్ లో మళ్లీ అగ్ని ప్రమాదం

Another fire accident in Secunderabad
  • రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు
  • మంటలను ఆర్పుతున్న మూడు ఫైర్ ఇంజన్లు
  • షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్న స్థానికులు
సికింద్రాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలికా బజార్‌లో ధమాకా సేల్ రెడీమేడ్ బట్టల షాప్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు రావడంతో చుట్టుప్రక్కల నివసించే వారు ప్రాణ భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు. 

దాని చుట్టుపక్కల మరిన్ని దుకాణాలతో పాటు లాడ్జీలు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు. షాట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, సికింద్రాబాద్ పరిధిలో గత కొంతకాలంగా రెండు షాపింగ్ కాంప్లెక్స్ లు, ఓ లాడ్జిలో అగ్ని ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Secunderabad
fire accident
cloth store
railway station

More Telugu News