మధ్యప్రదేశ్లో మరో ఘోరం.. ఈసారి పాదాలు నాకించారు!
- ఇటీవల ఓ గిరిజన కూలీపై మూత్ర విసర్జన ఘటన
- ఇప్పుడు చెప్పులతో చితకబాది పాదాలు నాకించిన నిందితులు
- ఇద్దరు నిందితుల అరెస్ట్.. పరారీలో ఉన్న వారి కోసం వేట
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడు, నిందితులు గ్వాలియర్ జిల్లాలోని డబరా ప్రాంతానికి చెందిన వారని పేర్కొన్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటన వెనక ప్రతీకార చర్య ఉన్నట్టు అనుమానిస్తున్నారు.