చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేపు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
- చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తో చేయి కలిపిన స్టార్ హాస్పిటల్స్
- చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ వద్ద హెల్త్ క్యాంపు
- సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు
- ఆదివారం ఉదయం 9.30 గంటలకు క్యాంపు ప్రారంభం
ఈ క్రమంలో, రేపు (జులై 9) హైదరాబాద్ లో తొలి క్యాంపును నిర్వహించనున్నారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, స్టార్ హాస్పిటల్స్ సౌజన్యంతో హైదరాబాదులోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ వద్ద ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఈ హెల్త్ క్యాంపు ప్రారంభం కానుంది. సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.