పొలంలో నాట్లు వేసిన రాహుల్ గాంధీ.. ఫొటోలు ఇవిగో
- హర్యానాలోని సోనిపట్ లో రైతులతో మాటామంతీ
- హిమాచల్ ప్రదేశ్ వెళుతూ మధ్యలో ఆగిన కాంగ్రెస్ మాజీ చీఫ్
- గతంలో రాత్రంతా ట్రక్కులో ప్రయాణించిన రాహుల్
ఇటీవల బైక్ మెకానిక్ గా కరోల్ బాగ్ ఏరియాలోని ఓ మెకానిక్ షాపులో స్క్రూడైవర్, పానా చేతబట్టిన రాహుల్ గాంధీ.. అంతకుముందు లారీ డ్రైవర్లతో కలిసి రాత్రంతా ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం హిమాచల్ ప్రదేశ్ లోని షిమ్లాలో ఉంటున్న సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను కలుసుకోవడానికి వెళుతూ మధ్యలో ఇలా రైతులను కలుసుకున్నారు. రాహుల్ గాంధీ గతంలో ఢిల్లీ నుంచి సిమ్లా వరకు రాత్రంతా ట్రక్కులో ప్రయాణించారు.