భట్టి విక్రమార్కకు కీలక ‘టాస్క్’ ఇచ్చిన రాహుల్ గాంధీ!
- కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణపై ఫోకస్ పెట్టిన రాహుల్
- ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయానికి వచ్చిన అధిష్ఠానం
- సర్వేలతో పాటు ఈ విషయంలో భట్టి నుంచి నివేదిక కోరిన రాహుల్!
ఆ సమయంలో రాష్ట్రంలో పార్టీలోని పరిస్థితులపై ఆరా తీయడంతో పాటు నేతల సమన్వయంపైన చర్చించారు. ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక కీలకం కావటంతో వీటిపైన భట్టి అభిప్రాయాలను రాహుల్ కోరినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. చివరి నిమిషంలో టికెట్లు ఖరారు చేయటం వలన గత రెండు ఎన్నికల్లో పార్టీ దెబ్బతింది. దీంతో ఈసారి ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సర్వేలతో పాటు పాదయాత్ర ద్వారా భట్టి తెలుసుకున్న విషయాలను క్రోడీకరించి భట్టి ఇచ్చే నివేదిక ద్వారా రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో భట్టి పాదయాత్రలో లభించిన ఫీడ్ బ్యాక్ ను తీసుకుంటానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఇది వరకే ప్రకటించారు.