బండి సంజయ్ తొలగింపుతో ఖమ్మం జిల్లా నేత ఆత్మహత్యాయత్నం
- ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఖమ్మం టౌన్ బీజేపీ ఉపాధ్యక్షుడు జి.శ్రీనివాస్
- తమకు సమాచారం లేదన్న పోలీసులు
- పార్టీ వర్గాలను ఉటంకిస్తూ ‘పీటీఐ’ వార్త
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోందని, ప్రాణాపాయం లేదని సమాచారం. ఇదే విషయాన్ని పార్టీ వర్గాలు నిర్ధారించినట్టు ‘పీటీఐ’ పేర్కొంది. కాగా, బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బీజేపీ పెద్దలు ఆ స్థానంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని నియమించారు. బండికి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి పదవి కేటాయించలేదు.