అనుమతి తీసుకున్నాకే హీరోయిన్‌కు ముద్దు.. సెలబ్రిటీపై నెట్టింట ప్రశంసల వర్షం
- ముంబైలో ‘తర్లా’ సినిమా ప్రచార కార్యక్రమంలో తళుక్కుమన్న నటి హ్యూమా ఖురేషీ
- కార్యక్రమానికి అథిగా విచ్చేసిన మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా షో మాజీ జడ్జి గ్యారీ మైగెన్
- ఇద్దరూ కలిసి ఫొటోలకు పోజులు
- నిన్ను ముద్దుపెట్టుకుంటానంటూ హ్యూమాను పర్మిషన్ అడిగిన గ్యారీ
- ఆమె ఓకే చెప్పాకే చుంబనం, వీడియో చూసి నెటిజన్ల ప్రశంసలు
బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ ప్రస్తుతం ‘తర్లా’ సినిమా చేసింది. ఇది త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. ఈ క్రమంలో ముంబైలో జరిగిన ఓ ప్రచార కార్యక్రమానికి ఆమె హాజరైంది. మాస్టర్ షెఫ్ ఆస్ట్రేలియా షో మాజీ జడ్జి గ్యారీ మైగెన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హ్యూమాతో కలిసి ఫొటోలకు పోజులిచ్చిన ఆయన ఆ తరువాత ‘‘నిన్ను ముద్దుపెట్టుకోనా?’’ అని హ్యూమాను కోరారు. హ్యూమా ఓకే చెప్పడంతో ఆమె బుగ్గపై చుంబించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆయన సంస్కారం చూసి ప్రశంసిస్తున్నారు. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.