బండి సంజయ్‌కి ప్రశంసలు, కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన రఘునందన్
- కిషన్ రెడ్డికి, ఈటల రాజేందర్ లకు దుబ్బాక ఎమ్మెల్యే శుభాకాంక్షలు
- బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ బాగా పని చేసిందని కితాబు
- కిషన్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వస్తుందని వ్యాఖ్య
'తెలంగాణ బీజేపీ సారథిగా నియమించబడిన కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు. బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ బాగా పని చేసింది. ఇప్పుడు కిషన్ రెడ్డి సారథ్యంలో పార్టీ అధికారంలోకి వస్తుంద'ని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ కోసం ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా నియమితులైన ఈటలకు శుభాకాంక్షలు తెలిపారు.