అమెరికాలో భారత కాన్సులేట్‌కు నిప్పంటించిన ఖలిస్థానీలు!
- ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటలకు దౌత్య కార్యాలయంపై దాడి
- వీడియో విడుదల చేసిన స్థానిక మీడియా
- ఈ ఘటనను ఖండించిన అమెరికా విదేశాంగ శాఖ
- దౌత్యకార్యాలయాలపై దాడులు క్రిమినల్ నేరమని హెచ్చరిక
ఆ ఘటనపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. ఈ హేయమైన చర్యను తాము ఖండిస్తున్నట్టు తెలిపారు. దౌత్యకార్యాలయాలపై దాడులకు పాల్పడడం క్రిమినల్ నేరమని హెచ్చరించారు.
ఈ ఏడాది మార్చిలో భారత ప్రభుత్వం వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ అరెస్టుకు సిద్ధమైన సందర్భంలోనూ ఖలిస్థానీలు శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయాన్ని టార్గెట్ చేసుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చి దౌత్య కార్యాలయం భవనం గోడలపై అభ్యంతరకర రాతలు రాశారు. కార్యాలయం తలుపులను ఇనుప రాడ్లతో కొట్టారు. ప్రాంగణంలో ఖలిస్థానీ బ్యానర్లు నెలకొల్పారు.