Twitter: ట్విట్టర్ లో కొత్త నిబంధనలు.. రోజుకు వెయ్యి ట్వీట్లే చూడొచ్చు

Twitter temporarily restricts tweets users can see
  • లాగిన్ అయితేనే ఇతరుల ట్వీట్లు చూసే అవకాశం
  • కొత్త ఖాతా దారులకు 500 ట్వీట్లు మాత్రమే చూసే పరిమితి
  • డేటా చౌర్యం అరికట్టేందుకు ఎలాన్ మస్క్ నిర్ణయం
సామాజిక మాధ్యమం ట్విట్టర్ లో పలు కొత్త మార్పులు వచ్చాయి. ట్విట్టర్ యూజర్లు ఇతరుల ట్వీట్లను చూడాలంటే అకౌంట్ లో తప్పనిసరిగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది వరకు లాగిన్ అవ్వకపోయనా.. వెబ్ బ్రౌజర్ ద్వారా ఇతర ఖాతాదారుల ట్వీట్లను చూసే అవకాశం ఉండేది. ట్విట్టర్ ఖాతా లేకపోయినా.. లింక్ ను బ్రౌజర్ లో ఓపెన్ చేసి చూసే వీలు ఉండేది. కానీ, ఈ సౌకర్యాన్ని ట్విట్టర్ నిలిపివేసింది. ఖాతాదారులు లాగిన్‌ అవుతూనే ఇతరుల వివరాలు చూడొచ్చు. అకౌంట్ లేని వారు క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇక, ట్విటర్‌ అన్ వెరిఫైడ్ ఖాతాదారులు రోజుకు 1000 ట్వీట్లు మాత్రమే చూసే అవకాశం కల్పించాలని ట్విట్టర్ అధినేత ఎలాన్‌ మస్క్‌ నిర్ణయించారు. కొత్తగా ఖాతా తెరిచిన వారు రోజుకు కేవలం 500 ట్వీట్లు మాత్రమే చూసే విధంగా పరిమితి విధించారు. డబ్బులు చెల్లించి ఖాతాను వెరిఫై చేసుకున్న వారు రోజుకు 10 వేల పోస్టులు చూడొచ్చు. తొలుత వెరిఫైడ్ ఖాతాదారులకు 6000, అన్ వెరిఫైడ్ వారికి 600, కొత్త ఖాతాదారులకు 300 పోస్టుల లిమిట్ పెట్టిన ఎలాన్ మస్క్ కొన్ని గంటల తర్వాత దాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ట్విట్టర్ నుంచి భారీ ఎత్తున డేటా చౌర్యం జరుగుతోందని, దాన్ని అరికట్టేందుకే ఈ చర్యలు తీసుకున్నామని మస్క్‌ చెబుతున్నారు. ఈ నిబంధనలు తాత్కాలికంగా ఉంటాయని తెలిపారు.
Twitter
restricts
tweets
users
Elon Musk

More Telugu News