Muthireddy: నన్ను ఎదుర్కొనే దమ్ములేని వాళ్లే నా కూతురిని రోడ్డుపైకి తెచ్చారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

Those who can not face me directly brought my daughter on to road says MLA Muthireddy
షార్ట్స్‌లో చూడండి
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డిల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధిగా తన విధులను నిర్వర్తించకుండా తన కూతురు, అల్లుడు అడ్డుకుంటున్నారంటూ హైకోర్టులో కూడా ఆయన పిటిషన్ వేశారు. 

తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన బిడ్డ బంగారు తల్లి అని, అమాయకురాలని చెప్పారు. తన బిడ్డను ఉపయోగించుకుని, అల్లుడిని ప్రేరేపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో తనను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేనోళ్లే తన బిడ్డను రోడ్డు మీదకు తెచ్చారని మండిపడ్డారు. ఆడపిల్లను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పని చేసుకునే తన బిడ్డను తనపైకి ఉసిగొలిపారని అన్నారు. తనకు ప్రజల ఆశీర్వాదం ఉందని చెప్పారు. 

Go Back to Shorts
Muthireddy
Daughter
BRS

More Telugu News