కొందరు యూజర్లకు యూట్యూబ్ హెచ్చరిక
- యూట్యూబ్ వీడియోలు చూసే సమయంలో ప్రకటనలు
- యాడ్ బ్లాకర్ టూల్స్ ను వినియోగిస్తున్న కొందరు యూజర్లు
- డిసేబుల్ చేసుకోవాలని లేదంటే మూడు వీడియోలే ఉచితమంటూ సందేశం
ప్రకటనల ఆదాయం తగ్గడానికి ఒక కారణం కూడా ఉంది. కొందరు యూజర్లు యాడ్ బ్లాకర్ టూల్స్ వాడుతున్నట్టు యూట్యూబ్ గుర్తించింది. దీనివల్ల యూట్యూబ్ వీడియోలను ఉచితంగానే ప్రకటనలు లేకుండా చూసుకోవచ్చు. ఇలాంటి యూజర్లపై చర్యలు తీసుకుంటోంది. యాడ్ బ్లాకర్ ను డిసేబుల్ చేసుకోవాలని లేదంటే, చూసే వీడియోల పరంగా పరిమితులు విధిస్తామంటూ హెచ్చరిక సందేశాలు పంపిస్తోంది. మూడు వీడియోలు చూసిన వెంటనే వీడియో బ్లాకర్ అప్లయ్ అవుతుందని స్పష్టం చేసింది. అంటే యాడ్ బ్లాకర్ సాఫ్ట్ వేర్ టూల్స్ వాడే వారు మూడు వీడియోలను మించి చూడలేరు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఉచిత వీడియోల కంటెంట్ ను అందించేందుకు ప్రకటనల అవసరాన్ని యూట్యూబ్ గుర్తు చేసింది.