మెగా ఫ్యాన్స్‌కు అలర్ట్.. నేడే ‘బ్రో’ టీజర్
- పవన్, సాయితేజ్ హీరోలుగా వస్తున్న ‘బ్రో’
- సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి
- జులై 28న విడుదల కానున్న చిత్రం
ముఖ్యంగా ఓ పోస్టర్లో పవన్ ‘తమ్ముడు’లో వేసిన కూలీ గెటప్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సాయిధరమ్ కూడా పవన్‌ని అనుసరిస్తూ అదే గెటప్ వేసుకొన్నాడు. ఈ చిత్రం నుంచి మెగా ఫ్యాన్స్ కోసం మరో ట్రీట్ రెడీ అయింది. చిత్రం టీజర్ ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. సాయితేజ్ సూటు, బూటులో స్టయిల్ గా నడిచొస్తున్న మరో పోస్టర్ ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. జులై 28న విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.