మధ్యప్రదేశ్ సీఎంకు వ్యతిరేకంగా ఫోన్‌పే లోగోతో పోస్టర్లు.. కాంగ్రెస్‌పై సంస్థ గుస్సా
- ముఖ్యమంత్రి వ్యతిరేక నిరసనల్లో లోగోతో పోస్టర్లు
- తమ లోగో వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫోన్‌పే హెచ్చరిక
- తమకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని వ్యాఖ్య
దీనిపై ఫోన్‌పై సోమవారం ట్విట్టర్ వేదికగా స్పందించింది. పోస్టర్ల నుంచి తమ సంస్థ లోగోను తక్షణం తొలగించాలని డిమాండ్ చేసింది. రాజకీయ, రాజకీయేతరులు ఎవరైనా తమ అనుమతి లేకుండా ఫోన్‌పే లోగోను వాడకూడదని హెచ్చరించింది. తమకు ఏ రాజకీయ పార్టీతో లేదా ప్రచార కార్యక్రమాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది.
కాగా, ఇటీవలి కర్ణాటక ఎన్నికల్లోనూ ఇదే తరహా పోస్టర్లు కనిపించాయి. ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ పార్టీ అప్పట్లో పేసీఎం పేరిట పోస్టర్లు ఏర్పాటు చేసింది.