తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ హఠాన్మరణం

  • కారుకొండలోని ఫౌమ్‌హౌస్‌లో ఉండగా సాయిచంద్‌కు అకస్మాత్తుగా అనారోగ్యం
  • చికిత్స కోసం నాగర్‌కర్నూల్‌లోని ఆసుపత్రికి తరలింపు
  • పరిస్థితి దిగజారడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలింపు
  • గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్ కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిన్న ఆయన కారుకొండలోని ఫౌమ్‌హౌస్‌‌లో ఉండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో, ఆయనను నాగర్‌కర్నూల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయనను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయిచంద్ హఠాన్మరణం చెందారు.

Folk singer Sai Chand
TRS
Hyderabad
Telangana

More Telugu News