జగన్ వంటి మేనమామ ఏ ఇంట్లో ఉన్నా తన్ని పంపిస్తారు: నాదెండ్ల మనోహర్
- రాష్ట్రంలోని పిల్లలందరికీ మేనమామలా అండగా ఉంటానన్న సీఎం జగన్
- ఇలాంటి మేనమామ ఏ కుటుంబంలో ఉండకూడదన్న నాదెండ్ల
- ప్రభుత్వ కార్యక్రమంలో, పిల్లల వద్దకు వెళ్లి ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తి అని విమర్శలు
ఒక ప్రభుత్వ కార్యక్రమంలో, పిల్లల వద్దకు వెళ్లి ఎలా మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడని నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని వ్యక్తిగత, రాజకీయ విమర్శలకు ఉపయోగించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జగన్ వంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలంటేనే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు.