Rishab Shetty: 'కాంతార 2' సెట్స్ పైకి వెళ్లే సమయం దగ్గరికి వచ్చేసినట్టే!

  • రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన 'కాంతార' 
  • భారీ వసూళ్లను రాబట్టిన సినిమా 
  • ప్రీక్వెల్ దిశగా జరుగుతున్న సన్నాహాలు 
  • ఆగస్టు 27వ తేదీ నుంచి షూటింగ్ మొదలు

Kantara Prequel Shooting Date Confirmed

కన్నడలో విజయ్ కిరగందూర్ నిర్మించిన 'కాంతార' సంచలన విజయాన్ని సాధించింది. ఈ సినిమాకి రచయితగా .. దర్శకుడిగా .. హీరోగా రిషబ్ శెట్టి వ్యవహరించాడు. కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. 16 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 450 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం ఒక రికార్డు. 

ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడంతో 'కాంతార 2' పై రిషబ్ శెట్టి దృష్టి పెట్టాడు. అయితే ఈ కథ 'కాంతార' కథను ఎక్కడ ముగించారో అక్కడ నుంచి మొదలుకాదు, 'కాంతార' కథ మొదలు కావడానికి ముందు జరిగిన కథ ఇది .. అంటే ప్రీక్వెల్ అన్నమాట. గిరిజనులకు రాజు మాట ఇవ్వడానికి ముందు ఈ కథ మొదలవుతుంది. 

ఇప్పటికే ఈ కథకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను రిషబ్ శెట్టి పూర్తిచేశాడు. ఆగస్టు 27వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఇక అసలు కథకు ముందు ఏం జరిగి ఉంటుందనే దాని కంటే, ఆ తరువాత ఏం జరిగి ఉంటుందనే విషయంపైనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందనేది అభిమానుల మాట. 

More Telugu News