Mahindra Scorpio: అమ్మకాల్లో మహీంద్రా స్కార్పియో రికార్డు

  • 9 లక్షల మార్క్ ను చేరుకున్న కంపెనీ
  • ఇటీవలే చకాన్ ప్లాంట్ లో తయారైన 9 వ లక్ష కారు 
  • ఒక్క మే నెలలోనే 9,318 యూనిట్ల స్కార్పియో విక్రయాలు
Mahindra Scorpio SUV hits major sales milestone

మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన ఎస్ యూ వీ స్కార్పియో అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. 9వ లక్ష స్కార్పియో ఎన్ మోడల్ తాజాగా పుణెలోకి చకాన్ కేంద్రం నుంచి బయటకు వచ్చింది. స్కార్పియోని కొత్త రూపంలో స్కార్పియో ఎన్ గా గతేడాది జూన్ లో మహీంద్రా విడుదల చేసింది. వాస్తవానికి 2002లో స్కార్పియో మొదటి సారి భారత మార్కెట్లోకి రాగా, అప్పటి నుంచి ఎన్నో మార్పులకు గురవుతూ వచ్చింది. 


ప్రస్తుతం స్కార్పియో ఎన్ తో పాటు, పాత రూపంలో స్కార్పియో క్లాసిక్ పేరుతో రెండు మోడళ్లను మహీంద్రా విక్రయిస్తోంది. మహీంద్రాకు సంబంధించి అత్యధికంగా అమ్ముడుపోయే కారు ఇదే. బొలెరో కంటే ఇదే ఎక్కువ ఆదరణ సంపాదించుకుంది. మే నెలలో 9,318 యూనిట్ల స్కార్పియో వాహనాలను మహీంద్రా విక్రయించింది. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ తో పోలిస్తే క్లాసిక్ ఎన్ కొంచెం పెద్దగా ఉంటుంది. 206 ఎంఎం పొడవు, 97 ఎంఎం వెడల్పు, 70 ఎంఎం వీల్ బేస్ తో ఉంటుంది. స్కార్పియో క్లాసిక్ అనేది మొదటి తరం స్కార్పియో పోలికలతో ఉంటే, స్కార్పియో ఎన్ కొత్త రూపంతో ఉంటుంది.

More Telugu News