బైక్ మెకానిక్ గా మారిన రాహుల్ గాంధీ.. ఫొటోలు ఇవిగో!
- కరోల్ బాగ్ లోని బైక్ మెకానిక్ షాప్ కు వెళ్లిన రాహుల్
- మార్కెట్ లోని వ్యాపారులు, మెకానిక్ లు, కార్మికులతో ముచ్చటించిన వైనం
- ఈ కార్మికుల చేతులే భారత్ ను నిర్మిస్తాయన్న రాహుల్
ఈ కార్మికుల చేతులే భారత్ ను నిర్మిస్తాయని రాహుల్ అన్నారు. వారి బట్టలకు అంటుకున్న గ్రీసు మన దేశ గౌరవం, ఆత్మాభిమానమని చెప్పారు. ప్రజల నాయకుడు మాత్రమే వారిని ప్రోత్సహిస్తాడని అన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... భారత్ జోడో యాత్ర కొనసాగుతూనే ఉందని వ్యాఖ్యానించింది.



