రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజినీరింగ్ సీట్లు ఖరారు చేసిన తెలంగాణ విద్యాశాఖ
- మే 25న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
- జూన్ 26 నుంచి కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్
- జులై 16 నుంచి సీట్ల కేటాయింపు
- రేపటి నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు
137 ప్రైవేటు కాలేజీల్లో 80,091 ఇంజినీరింగ్ సీట్లు, 16 యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీల్లో 4,713 సీట్లు, 2 ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 1,302 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఏడాది కన్వీనర్ కోటా కింద 62,079 సీట్లు కేటాయించారు.
అత్యధికంగా సీఎస్ఈ ట్రేడ్ లో 15,897 సీట్లు, ఈసీఈలో 9,732 సీట్లు అందుబాటులో ఉంచారు. రేపటి నుంచి ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.