Etela Rajender: ఈటల దంపతుల వ్యాఖ్యలకు కౌశిక్ రెడ్డి కౌంటర్

Koushik Reddy responds on Etala Rajender and Jamuna comments
షార్ట్స్‌లో చూడండి
ఈటల దంపతులు చేసిన ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ఈటల జమున వ్యాఖ్యలు అన్నీ అబద్ధాలే అన్నారు. ఆ దంపతులిద్దరు తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. జమున కూడా ఈటల డైరెక్షన్ లోనే మాట్లాడారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం అభివృద్ధిపై తాను ఈటలతో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. హత్యా రాజకీయాలు ఈటలకు అలవాటు అని విమర్శించారు. 2001లో నర్సింగాపూర్ ఎంపీటీసీని హత్య చేయించారనే ఆరోపణలు ఉన్నాయని మండిపడ్డారు.

హుజూరాబాద్ లో అమరుల స్థూపాన్ని తాను కూలగొట్టించినట్లు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా మున్సిపాలిటీ వాళ్లే దానిని తొలగించారన్నారు. ఆ స్థూపంపై ఈటల పేరు లేదని, అసలు అక్కడ శిలాఫలకమే లేదన్నారు. అసలు టీఆర్ఎస్ పుట్టినప్పుడు ఈటల రాజేందర్ ఎక్కడున్నాడని ప్రశ్నించారు. 2004లో ఎమ్మెల్యే కావడం కోసం తమ పార్టీలోకి వచ్చారని ఆరోపించారు.
Go Back to Shorts
Etela Rajender
koushik reddy
BRS

More Telugu News