‘తమ్ముడు’ని గుర్తు చేశావు ‘బ్రో’!

bro teaser date locked with crazy poster
మామ అల్లుళ్లు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తొలిసారి కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో’. విలక్షణ నట దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీజర్ ఎప్పుడొస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ అప్‌డేట్ ఇచ్చారు.

‘‘ఆటపట్టించడం (టీజ్) అయిపోయింది.. ఎంతో మంది ఎదురుచూసిన టీజర్ అప్‌డేట్‌ త్వరలోనే వస్తోంది” అని చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. పవన్, సాయి ధరమ్ తేజ్‌లపై పోస్టర్ ని రిలీజ్ చేసింది.

తమ్ముడు సినిమాలోని వయ్యారి భామ పాట లుక్‌లో పవన్ పోజు అదిరిపోయింది. ఎర్ర షర్ట్, లుంగీలో పవన్.. ప్యాంట్‌పైనే లుంగీతో సాయి ధరమ్ కనిపించారు. మరోవైపు సాయి ధరమ్ కూడా ఈ పోస్టర్‌‌ను ట్వీట్ చేశారు. త్వరలోనే టీజర్‌‌ విడుదల కానుందని చెప్పారు.

సినిమాను జులై 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘వినోదాయ సితం’ సినిమాకు రీమేక్‌నే ఈ ‘బ్రో’. తమిళంలో స్వీయ దర్శకత్వంలో నటించిన సముద్ర ఖని.. తెలుగు రీమేక్‌ను తెరకెక్కిస్తున్నారు.
Go Back to Shorts
bro
Pawan Kalyan
Sai Dharam Tej
samuthirakani
People Media Factory

More Telugu News