‘నైరుతి’ ఆలస్యం.. ఆకాశాన్నంటనున్న టమాటా ధరలు..!
- వర్షాలు లేక కూరగాయల ధరల పెరుగుదల
- దేశవ్యాప్తంగా కిలో టమాటా ధర రూ.100 మార్కు దాటే అవకాశం
- ఉల్లి, బంగాళదుంప మినహా మిగతా కూరగాయల ధరలన్నీ పెరుగుతున్నాయన్న మార్కెట్ వర్గాలు
ఉల్లి, బంగాళదుంప మినహా ఇతర కూరగాయల ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మధ్యప్రదేశ్‌లో ఇప్పటికే కూరగాయల ధరలు సామాన్యులను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. భోపాల్‌లో గతవారంతో పోలిస్తే కిలో టమాటా 10 రూపాయల మేర పెరిగి రూ.100కు చేరుకుంది.