Priyamani: ముస్లింను ఎందుకు పెళ్లిచేసుకున్నావని నన్ను తిట్టారు: ప్రియమణి

Actor priyamani talks about being a victim of trolling in latest interview
  • తానూ ట్రోలింగ్ బారినపడ్డానన్న ప్రియమణి
  • వీటిని పెద్దగా పట్టించుకోనని వ్యాఖ్య 
  • తన జీవితం తన ఇష్టమని స్పష్టీకరణ
తానూ ట్రోలింగ్ బారిన పడ్డానని ప్రముఖ నటి ప్రియమణి వెల్లడించారు. తన పెళ్లి విషయంలో కొందరు నెటిజన్లు నోరు పారేసుకున్నారని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. 

‘‘ట్రోలింగ్‌ను నేను పెద్దగా పట్టించుకోను. బాడీ షేమింగ్, మేని ఛాయ విషయంలో ఇప్పటికీ నాపై విమర్శలు వస్తూనే ఉంటాయి. అయితే, ముస్తఫాను లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు సోషల్ మీడియాలో నేను చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నా. మా నిశ్చితార్థం ఫొటోలు షేర్ చేసినప్పుడు ‘నువ్వు ముస్లింను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు’ అని కొందరు తిట్టారు. ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్లందరికీ నేను చెప్పేది ఒకటే. ఇది నా లైఫ్. ఎవరితో జీవితాన్ని పంచుకోవాలనేది పూర్తిగా నా ఇష్టం’’ అని ఆమె స్పష్టం చేశారు.  

‘పెళ్లైన కొత్తలో’, ‘గోలీమార్’, ‘యమదొంగ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రియమణి పెళ్లి తరువాత కూడా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు.
Priyamani

More Telugu News