Madhya Pradesh: ఈ మేక బరువు 176 కిలోలు, ధర ఏకంగా రూ.12 లక్షలు!

Kota Goat sold for rs 12 lakhs in madhyapradesh
  • మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
  • రికార్డు ధరకు అమ్ముడుపోయిన కోటా జాతికి చెందిన మేక
  • యాజమానికి పట్టరానంత సంబరం
మధ్యప్రదేశ్‌లో కోటా జాతికి చెందిన ఓ మేక ఏకంగా రూ.12 లక్షలకు అమ్ముడుపోయింది. సుహైల్ అహ్మద్ అనే వ్యక్తి సుమారు 8 నెలల క్రితం రాజస్థాన్‌లో ఈ మేకను కొనుగోలు చేశాడు. ఆ తరువాత అనేక జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని పెంచాడు. దానికి కింగ్ అని పేరు పెట్టాడు. మేకకు రోజూ శనగలు, గోధుమలు, పాలు, ఖర్జూరం, వంటి పదార్థాలనే ఆహారంగా ఇచ్చేవాడు. 

వేసవిలో దానికి ఎండ దెబ్బ తగలకుండా రెండు కూలర్లు కూడా ఏర్పాటు చేశాడు. దీంతో, కింగ్ చూస్తుండగానే 176 కిలోల బరువుకు చేరుకుంది. బక్రీద్ సందర్భంగా కింగ్‌ను ఇటీవల అమ్మకానికి పెట్టగా ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 12 లక్షలకు కొనుగోలు చేశాడు. 


Madhya Pradesh
Rajasthan

More Telugu News