సూపర్ ఓవర్ ‌లో వాన్ బీక్ 30 పరుగులు, విండీస్‌కు నెదర్లాండ్స్ షాక్

Logan van Beek Heroics Help Netherlands Stun West Indies
  • సూపర్ ఓవర్లో వరుసగా 4, 6, 4 , 6, 6, 4  పరుగులు చేసిన నెదర్లాండ్స్ ఆటగాడు
  • ఫోర్లు, సిక్సర్లతో 30 పరుగులు
  • ఆ తర్వాత బంతితోను మాయచేసిన వాన్ బీక్
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్-2023లో విండీస్ కు నెదర్లాండ్స్ షాకిచ్చింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ లో స్కోర్ సమం అయింది. సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ అద్భుత విజయం సాధించింది. నెదర్లాండ్స్ బౌలర్ లోగాన్ వాన్ బీక్ సూపర్ ఓవర్లో వరుసగా 4, 6, 4 , 6, 6, 4 బాది సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. 

హరారే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 374 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ సెంచరీతో (104) అదరగొట్టాడు.

లక్ష్యఛేదనలో నెదర్లాండ్స్ ప్రారంభంలో తడబడినప్పటికీ ఆ తర్వాత నిలకడగా ఆడింది. తెలుగుతేజం తేజ నిడమనూరు (111) సెంచరీతో అలరించాడు. స్కాట్ ఎడ్వర్డ్స్ (67) కూడా రాణించడంతో చివరకు స్కోర్ సమం అయింది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్ లోకి మళ్లింది.

సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ కు చెందిన వాన్ బీక్ ఫోర్లు, సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. ఆ తర్వాత వాన్ బీక్ బంతితోను అదరగొట్టాడు. సూపర్ ఓవర్ వేసిన వాన్ బీక్ తొలి బంతికి సిక్స్ ఇచ్చాడు. రెండో బంతికి ఒక పరుగు ఇచ్చాడు. కానీ ఆ తర్వాత రెండు బంతుల్లో విండీస్ ఆటగాళ్లను ఔట్ చేశాడు. ఈ క్రమంలో నెదర్లాండ్స్ విజయం సాధించింది.
Go Back to Shorts
west indies
netherlands
Cricket

More Telugu News