పంటలను కాపాడుకునేందుకు యూపీ రైతుల కొత్త ఐడియా
- యూపీలోని లఖింపూర్ ఖేరీ గ్రామంలో కోతుల బెడద
- పంటలకు నష్టం కలిగిస్తుండడంతో పరిష్కారంపై దృష్టి
- ఎలుగుబంటి మాదిరి కాస్ట్యూమ్ ధరించడంతో తొలగిన సమస్య
దాన్ని ధరించి తమ పంట పొలంలో పగలంతా నించునేవారు. ఆ డ్రెస్ ధరించి, అచ్చం ఎలుగుబంటి మాదిరిగా ఉండడంతో కోతులు భయంతో అటు వైపు రావడానికి సాహసం చేయలేదు. యూపీలోని లఖింపూర్ ఖేరీ ప్రాతంలో ఇది జరిగింది. గ్రామంలో కోతుల బెడద, వాటివల్ల పంటలకు జరుగుతున్న నష్టంపై రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో చివరికి గ్రామంలోని రైతులు అందరూ ఎలుగుబంటి కాస్ట్యూమ్ కొనుగోలు చేశారు. వాటిని ధరించి తమ తమ పంట పొలాల్లో నించోవడం మొదలు పెట్టిన తర్వాత కోతుల బెడద తగ్గిపోయింది.