Leonardo DiCaprio: బ్రిటిష్ పంజాబీ మోడల్ నీలమ్‌తో మరోమారు దొరికిన టైటానిక్ హీరో

Leonardo DiCaprio seen dining with model Neelam Gill again
  • పారిస్‌లో డిన్నర్ చేస్తూ కెమెరాలకు చిక్కిన డికాప్రియో, నీలమ్ గిల్
  • వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు
  • తొలిసారి మే 31న కలిసి కనిపించిన జంట
‘టైటానిక్’ హీరో లియోనార్డో డికాప్రియో, భారత సంతతికి చెందిన బ్రిటిష్ పంజాబీ మోడల్ నీలమ్ గిల్ (28) మరోమారు కెమెరాలకు దొరికిపోయారు. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు వీటికి మరింత బలం చేకూర్చే ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ నెల 23న ఇద్దరూ కలిసి పారిస్‌లో డిన్నర్ చేస్తూ మీడియా కంటపడ్డారు. 

మే 31న తొలిసారి డికాప్రియో, నీలమ్ కలిసి కనిపించారు. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. పారిస్ డిన్నర్‌లో డికాప్రియా బెస్ట్‌ఫ్రెండ్ టోబీ మగుయిర్‌తోపాటు ఇతర స్నేహితులు కూడా కనిపించారు. మగుయిరీ పిల్లలు రూబీ (16), ఒటిస్(14), డికాప్రియో మేనకోడలు నోర్మాండీ (16) కూడా వీరితో ఉన్నారు. నీలమ్ బ్లాక్ ట్యాంక్ టాప్, బీగీ మినీ స్కర్ట్ ధరించి కనిపించింది.

నీలమ్ గిల్‌తో డికాప్రియో నైట్‌ అవుట్స్‌తో ఎంజాయ్ చేస్తున్నట్టు తొలుత విదేశీ మీడియా వెలుగులోకి తెచ్చింది. నీలమ్ 14 ఏళ్ల వయసు నుంచే మోడలింగులో ఉంది. ఆమె తాతలు పంజాబ్‌కు చెందినవారు. ఈ ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లోనూ నీలమ్ మెరిసింది. దీనికి డికాప్రియో కూడా హాజరయ్యాడు. కాగా, బ్రిటిష్ సింగర్ జేన్ మాలిక్‌తో నీలమ్ డేటింగ్‌లో ఉన్నట్టు 2015లో వార్తలు వచ్చినా ఆమెప్పుడూ దీనిపై స్పందించలేదు.
Leonardo DiCaprio
Neelam Gill
Paris

More Telugu News