Kafas: ఈ రెండు వెబ్ సిరీస్ లు చూడొచ్చు .. ఎందుకంటే..!

Latest Web Series Updates

  • సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'కాఫస్'
  • మారుతున్న సమాజంలో వాస్తవాలకి అద్దం పట్టే కథ 
  • హాట్ స్టార్ లో అందుబాటులో ఉన్న 'కేరళ క్రైమ్ ఫైల్స్'
  • సహజత్వానికి దగ్గరగా నడిచే కథాకథనాలు 
  • రెండు వెబ్ సిరీస్ లు ఆసక్తికరమైనవే .. ఆకట్టుకునేవే

రీసెంట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి వచ్చిన వెబ్ సిరీస్ లలో, కంటెంట్ పరంగా రెండు వెబ్ సిరీస్ లు ఆకట్టుకుంటున్నాయి. రెండు వెబ్ సిరీస్ లలో ఆహా అనే స్థాయిలో అద్భుతాలు జరగవు .. ఒక బలమైన డ్రామాలో ప్రేక్షకుడిని కూడా ఒక పాత్రగా చేసి, ఆ కథలో ప్రయాణం చేయిస్తాయి. వాటిలో ఒకటిగా 'కాఫస్' కనిపిస్తుంది. సోనీ లివ్ లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. మారుతున్న సమాజంలో ఒక సంపన్న కుటుంబం వలన, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎదుర్కున్న సమస్యనే ఈ కథ. 

కొంతమంది డబ్బున్నవారు .. ఆ డబ్బుతో స్టేటస్ ను కొనగలరు .. ఆ డబ్బుతో దానిని కాపాడుకోగలరు. డబ్బున్నవారు ఆ డబ్బు ఒక్కటి ఉంటే చాలు బ్రతికేయగలరు. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వారు బ్రతకడానికి డబ్బు మాత్రమే సరిపోదు .. నైతిక విలువలు కూడా కావాలి. అటు డబ్బును .. ఇటు నైతిక విలువలను వదులుకోలేని ఒక మధ్యతగతి కుటుంబం పడే మానసిక సంఘర్షణ ఈ కథ. చూస్తున్నంత సేపు ఆలోచింపజేస్తూనే ఉంటుంది.ఇక మరో వెబ్ సిరీస్ 'కేరళ క్రైమ్ ఫైల్స్' .. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. పోలీసులకి కూడా ఒక మనసుంటుంది .. వాళ్లకి ఒక ఫ్యామిలీ ఉంటుంది .. భార్యా బిడ్డల పట్ల ఎమోషన్స్ ఉంటాయి. అయినా అవన్నీ పక్కన పెట్టేసి డ్యూటీ చేయవలసిన పరిస్థితులు ఉంటాయనేది ఆవిష్కరించిన కథ ఇది. ఒక మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథనం ఇది. 

ఒక వేశ్య దగ్గరికి వచ్చిన విటుడు, తాను పెళ్లి చేసుకోబోతున్నాననీ .. అయితే ఆల్రెడీ ఆమెకి వివాహమైందని చెబుతాడు. అప్పుడు ఆ వేశ్య 'అయితే నాకూ .. ఆవిడకి తేడా ఏముంది?' అంటుంది. ఈ వెబ్ సిరీస్ 'కీ' డైలాగ్ ఇదే. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. పోలీసులతో పాటు ప్రేక్షకుడు కూడా ఆ ఇన్వెస్టిగేషన్ లో భాగమవుతాడు. సహజత్వానికి దగ్గరగా నడిచే ఈ వెబ్ సిరీస్ ను, వీలైనప్పుడు చూడండి .. మీకూ నచ్చుతుంది.

More Telugu News