Dil Raju: డబ్బులు తక్కువగా ఉన్నప్పుడల్లా ఏం చేసేవారో చెప్పిన దిల్ రాజు!

Dil Raju on Tholi Prema movie
షార్ట్స్‌లో చూడండి
పవన్ కల్యాణ్ కెరీర్ లోని సూపర్ హిట్ చిత్రాల్లో తొలిప్రేమ ఒకటి. ఈ సినిమా గురించి దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలు అందించిందని, తన జీవితంలో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. డబ్బులు తక్కువగా ఉన్నప్పుడల్లా ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసినట్లు చెప్పారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ఎన్నో మంచి జ్ఞాపకాలు మిగిల్చిందని చెప్పారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ గా పని చేశానని, తన జీవితాన్ని ఒక పుస్తకంలా రాస్తే తొలిప్రేమకు తప్పకుండా ఒక పూర్తి పేజీ ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీసినప్పటికీ, తొలిప్రేమ తనకు ప్రత్యేకం అన్నారు.

తొలిప్రేమ సినిమా వందో రోజునే ఇండియా - పాక్ మ్యాచ్ జరిగిందని, ఆ రోజు కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు సంధ్య థియేటర్ వద్ద భారీగా వరుస కట్టారన్నారు. ఇలాంటివి జరగడం ఓ చరిత్ర అన్నారు. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ కు అయిదేళ్ల పాటు తనకు హక్కులు ఇచ్చారని, దీంతో డబ్బులు తక్కువగా ఉన్న ప్రతిసారి ఈ సినిమాను మళ్లీ విడుదల చేస్తూ వెళ్లానన్నారు. ఈ రోజు తాను ఈ స్థాయిలో ఉండటానికి ఈ సినిమా ఒక కారణమన్నారు. ఇది తనకు ఎన్నో నేర్పించిందని చెప్పారు.  తొలిప్రేమ రీరిలీజ్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడారు.
Go Back to Shorts
Dil Raju
Pawan Kalyan
tholi prema

More Telugu News