పాట్నాలో రాహుల్ గాంధీపై బీజేపీ కార్యాలయం ఎదుట ఆసక్తికర ఫ్లెక్సీ
- ప్రతిపక్షాల సమావేశానికి ముందు దేవదాస్ ఫ్లెక్సీ
- షారుక్ ఖాన్ రీల్ లైఫ్, రాహుల్ గాంధీ నిజజీవితంలో దేవదాస్ అంటూ వ్యాఖ్యలు
- రాజకీయాలను వీడాలని అందరూ అడిగే రోజు ఎంతో దూరంలో లేదంటూ విమర్శ
మమతా బెనర్జీ బెంగాల్ ను, కేజ్రీవాల్ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలను, లాలు ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ లు బీహార్ ను, అఖిలేష్ యాదవ్ ఉత్తర ప్రదేశ్ ను, స్టాలిన్ తమిళనాడును, రాహుల్ గాంధీ రాజకీయాలను వీడాలని అందరూ కాంగ్రెస్ ను అడిగే రోజు ఎంతో దూరంలో లేదని, షారుక్ ఖాన్ రీల్ దేవదాసు అయితే, రాహుల్ రియల్ లైఫ్ దేవదాస్ అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు.