భట్టిని కలిసిన పొంగులేటి.. కేసీఆర్ ను ఓడించడానికి నాలుగు మెట్లు దిగుతానని వ్యాఖ్య
- కాంగ్రెస్ లో చేరే విషయంలో పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారన్న పొంగులేటి
- మాయ మాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని విమర్శ
- అమరవీరులను కేసీఆర్ ఆదుకోలేదని మండిపాటు
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ... తాను కాంగ్రెస్ చేరే విషయంలో పెద్దలంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికి పంపించేందుకు నాలుగు మెట్లు దిగతామని అన్నారు. మాయ మాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పలకాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ఆదుకోలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను, వ్యవస్థలను, హామీలను గాలికొదిలేశారని అన్నారు.