ప్రధాని మోదీకి వైట్ హౌస్ లో అదిరిపోయే విందు.. మెనూ ఇదే!
- ప్రధాని శాకాహారి కావడంతో మిల్లెట్ తో చేసిన ప్రత్యేక వంటకాలు
- త్రివర్ణ రంగుల పువ్వులతో అలంకరణ
- డిన్నర్ ముగిసిన తర్వాత సంగీత ప్రదర్శన
ఫస్ట్ కోర్స్ కింద (డిన్నర్ ఆరంభంలో) మ్యారినేటెడ్ మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నెల్ సలాడ్, కంప్రెస్డ్ వాటర్ మెలాన్, ట్యాంగీ అవకాడో సాస్ ఇస్తారు. తర్వాత మెయిన్ కోర్స్ లో భాగంగా స్టఫ్డ్ పోర్టోబెల్లో పుట్టగొడుగులు, క్రీమీ శాఫ్రాన్ రిసోట్టో, సుమాక్ రోస్టెడ్ సీ బాస్, లెమన్ డిల్ యుగర్ట్ సాస్, క్రిస్డ్ మిల్లెట్ కేక్స్, సమ్మర్ స్క్వాషెస్ వడ్డిస్తారు.
టేబుల్స్ పై శాఫ్రాన్ కలర్ పువ్వులతో అలంకరిస్తారు. భారత జాతీయ పతాకంలోని రంగుల పూలతో ఈ అలంకరణ ఉంటుంది. డిన్నర్ అనంతరం గ్రామీ అవార్డు విజేత జోషువా బెల్, పెన్ మసాలా, దక్షిణాసియాకు చెందిన అకపెల్ల గ్రూప్ తో సంగీత ప్రదర్శన ఉంటుంది.

