Ola electric: ఓలా నుంచి త్వరలోనే మరో కొత్త స్కూటర్

New Ola S1 variant to be launched in July
  • జులైలో విడుదల చేయనున్న సంస్థ
  • రెండువైపులా హ్యాండిల్ గ్రిప్పర్స్ వద్ద ఎల్ఈడీ లైట్స్
  • ఇంటర్నల్ కంబస్టన్ తరానికి ముగింపు అంటూ ఓలా క్యాప్షన్
ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహన ప్రియుల కోసం త్వరలోనే మరో స్కూటర్ ను పరిచయం చేయనుంది. ఈ విషయాన్ని ఓలా కంపెనీ స్వయంగా ప్రకటించింది. వచ్చే నెలలోనే ఈ స్కూటర్ ను విడుదల చేయనుండడంతో దీనిపై ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే ఓలా మూడు రకాల స్కూటర్ వేరియంట్లను మార్కెట్లో విక్రయిస్తోంది. ఓలా ఎస్1 ప్రో, ఎలా ఎస్1, ఓలా ఎస్1 ఎయిర్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా పాప్యులర్ అయినది ఎస్1 ప్రో మోడల్.

‘‘ఈ జులైలోనే మీ స్క్రీన్లపై రాబోతున్నాం. చూస్తూనే ఉండండి’’ అంటూ ట్వీట్ పెట్టింది. స్కూటర్ కి హెడ్ లైట్ మాత్రమే కాకుండా, హ్యాండిల్ కుడి, ఎడమ ముందు భాగంలోనూ లైట్లతో ఈ స్కూటర్ చూడ్డానికి కొత్తగా కనిపిస్తోంది. ‘‘ఇంటర్నల్ కంబస్టన్ తరానికి ముగింపు. భారత ఎలక్ట్రిక్ రంగానికి సూర్యోదం’’ అంటూ క్యాప్షన్లు పెట్టింది. చూడబోతుంటే ఇందులో కొత్త ఫీచర్లు, ఆకర్షణలు తప్పకుండా ఉంటాయని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఓలా మరింత వాటాను గెలుచుకునే వ్యూహంతో కనిపిస్తోంది.

More Telugu News

Ola electric
new scooter
launching
july