ప్రధాని పేరు తెలియదన్నాడని పెళ్లి రద్దు చేసుకొని.. అతని తమ్ముడిని చేసుకున్న యువతి
- ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లాలో వింత ఘటన
- ఈ నెల 11న శివశంకర్ అనే వ్యక్తితో రంజనకు వివాహం
- ఆ పెళ్లి వద్దని మరుసటి రోజే అతని తమ్ముడితో పెళ్లి
ఆ మరుసటి రోజు ఉదయం పెళ్లి వేడుకల్లో భాగంగా వధువు ఇంట్లో చిన్న కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రంజన చెల్లెలు, ఆమె సోదరుడితో మాటలు వరుడు కలిపాడు. ఈ సందర్భంగా దేశ ప్రధాని ఎవరని రంజన సోదరి శివ శంకర్ ను ప్రశ్నించింది. దీనికి శివ శంకర్ సమాధానం చెప్పలేకపోవడంతో పక్కనే ఉన్న బంధువులు అతడిని హేళన చేశారు. ఇదంతా చూసిన వధువు రంజన అవమానంగా భావించింది. శివ శంకర్ తో పెళ్లిని రద్దు చేసుకొని అక్కడికక్కడే అతని తమ్ముడైన అనంత్ ను పెళ్లి చేసుకుంది.