దేశంలో వడగాలుల తీవ్రతపై రంగంలోకి దిగిన కేంద్రం
- తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
ఉన్నత స్థాయి సమీక్ష - సూచనలు ఇవ్వాలని ఐసీఎంఆర్ కు మంత్రి ఆదేశం
- ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందం ఏర్పాటు
వేడిగాలుల వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇవ్వాలని కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)కు మంత్రి ఆదేశించారు. ఆరోగ్య శాఖ, ఐఎండీకి చెందిన ఐదుగురు సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని మాండవీయ చెప్పారు. వడగాలుల తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక బృందం పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తుందన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో ఈ రోజు వర్చువల్ భేటీ నిర్వహిస్తామని చెప్పారు.