కాపులను జగన్ కు తాకట్టు పెట్టారు.. ఉద్యమాన్ని గంగలో కలిపేశారు: ముద్రగడపై హరిరామజోగయ్య ఫైర్
- ముద్రగడపై ఉన్న సదభిప్రాయం పోయిందన్న హరిరామజోగయ్య
- రాజకీయ లబ్ధి కోసమే కాపు ఉద్యమాన్ని నడిపారని విమర్శ
- ద్వారంపూడికి ముద్రగడ మద్దతునివ్వడం సిగ్గుచేటని వ్యాఖ్య
ఇంతకాలం ముద్రగడపై తనకున్న సదభిప్రాయం ఈ రోజుతో పోయిందని హరిరామజోగయ్య అన్నారు. పదవుల కోసం కాపు సామాజికవర్గాన్ని జగన్ కు తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ముద్రగడ కాపు ఉద్యమాన్ని నడిపారనే విషయం అర్థమయిందని చెప్పారు. కాపు ఉద్యమాన్ని గంగలో కలిపేశారని దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముద్రగడ మద్దతునివ్వడం సిగ్గుచేటని అన్నారు.